Sunday 4 September, 2011

తెలుగు పద్యనాటకం: .తెలంగాణా డ్రమెటిక్ అసోసియేషన్,వరంగల్.

తెలుగు పద్యనాటకం: .తెలంగాణా డ్రమెటిక్ అసోసియేషన్,వరంగల్.: తెలంగాణా ప్రాంతంలో అంతగా ప్రాచుర్యం లేని తెలుగు పౌరాణిక పద్యనాటకాలకు గుర్తింపు తీసుకొనిరావాలనే ఉద్దేశ్యంతో 'తెలుగు పద్యాన్ని బ్రతికించండి - పద్యనాటక మనుగడకు  సహకరించండి " అనే నినాదంతో 1998వ సం.లో,వరంగల్ నగరంలో  ఈ సంస్థ పందిళ్ళ శేఖర్ బాబు చే స్థాపించబడింది.రిజిష్టర్ నెం.2312/2000.ఈ సంస్థ చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు.

1) పద్యనాటక వైభవాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో 2000 సం.ఫిబ్రవరి 5 నుండి 11వ తేదీ వరకు వరంగల్ లో "పౌరాణిక పద్యనాటక సప్తాహం " నిర్వహించి అందులో శ్రీ కృష్ణరాయబారం,సత్య హరిశ్చంద్ర,చింతామణి,శ్రీ కృష్ణతులాభారం,లవకుశ,గయోపాఖ్యానం మరియు శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకాలను ప్రదర్శించింది.

2)తిరిగి 2009వ సం.ఏప్రిల్,మే నెలలలో హనుమకొండ పట్టణం లోని నేరెళ్ళ వేణుమాధవ్ ఆడిటోరియంలో ఇవే ఏడు నాటకాల ప్రదర్శనతో " పౌరాణిక పద్యనాటక సప్తకము " నిర్వహించింది.
   
3) ఇఫ్ఫటివరకు రవీంద్రభారతి,త్యాగరాయగానసభ, తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం,తిరుపతిలోని మహతి ఆడిటోరియం వంటి ప్రతిష్టాత్మకమైన వేదికలతో పాటుగా విజయవాడ,గుంటూరు వంటి పట్టణాలలో 437 పౌరాణీక పద్యనాటక ప్రదర్శనలు ఇచ్చింది.

4) 2008లో తిరుపతిలో జరిగిన గరుడ పోటీలలో ప్రదర్శించిన శ్రీ కృష్ణరాయబారం నాటకంలో  ఉత్తమ సంగీతానికి ఆర్.భద్రాచలం భాగవతార్  మరియు ఉత్తమ పద్యపఠనం విభాగంలో పందిళ్ళ శేఖర్ బాబు వ్యక్తిగత గరుడ అవార్డులను సాధించారు.

5) 2011 గరుడ పోటీలలో గయోపాఖ్యానం నాటకాన్ని ప్రదర్శించి ద్వితీయ ప్రదర్శనకు వెండి గరుడ అవార్డుతోపాటుగా ఉత్తమనటుడు విభాగంలో దేవర్రాజు రవీందర్ రావుకు,ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా తోట సత్యనారాయణకు వ్యక్తిగత అవార్డులు లభించాయి.

ఇప్పటికీ ఈ సంస్థ ఎంతో ఉత్సాహంతో క్రమంతప్పకుండా నాటకప్రదర్శనలను ఇస్తున్నది.         ..

1 comment:

  1. dear sri sekhar babu , I like telugu padya natakam,but I am not an actor.I am a retired employee.My native place is tadepalligudem,west godavary district. I have seen many telugu padyanatakams enacted by Sri Shanumkhi,Peesapati,V.Saidulu DV subbarao,YGopalarao,Pridhvi Venkatesrulu etc. In Tadepalligudem there is socirty Nataraja Peetham run by Sri M.Suryanaryana. Natarajahpeetham every month conduct a meeting and felicitate oldage acters,technicians of Telugu stage drama and give some financial help to the poor artists. I am member of that natarajapeetham. Now I require telugu padya natakam MP3 or video DVD s.Please provide me address where I can get them.My phone no is 9849488759 Varadacharyulu

    ReplyDelete