తెలుగుభాషకు మాత్రమే స్వంతమైన,మరే ఇతర భాషాసాహిత్యాలలోనూ కానరాని అద్భుత ప్రక్రియ "తెలుగు పద్యనాటకం".దాదాపు 125 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ రంగంలో ఎన్నో అద్భుతమైన నాటకాలు వెలువడ్డాయి.ఎందరెందరో ప్రాతఃస్మరణీయులు అజరామరమైన రచనలు చేశారు.మరెందరో మహానుభావులు తమ గాత్రంతో,నటనతో ఈ పద్యనాటకాలకు జీవం పోశారు.అయితే ఇంతటి ఉత్కృష్టమైన ఈ ప్రక్రియపట్ల నేటి "కంప్యూటర్ తరం" ఆసక్తి అంతగా ప్రదర్శించడం లేదేమో అనిపించి మనమే వాళ్ళ ముంగిట్లోవెళ్ళి ఈ కళపట్ల ఆసక్తి కలిగించాలనే ఈ చిన్న ప్రయత్నం.
Friday, 18 March 2011
Wednesday, 9 March 2011
తెలుగు పద్యనాటకం
'పద్యం' కేవలం తెలుగు వారికే స్వంతమైన విశిష్ట సాహితీ ప్రక్రియ.ఛందోబద్ధమైన పద్యాలకు సందర్భోచితమైన రాగాలను మేళవిస్తే బంగారానికి తావి అబ్బినట్లుగా ఉంటుంది.తిరుపతి వెంకటకవుల పాండవోద్యోగ విజయాలు ,బలిజేపల్లి వారి సత్యహరిశ్చంద్రీయం,చిలకమర్తి వారి గయోపాఖ్యానం నాటకాలు తెలుగు భాషాసాహిత్యాలు నిలిచి ఉన్నంతకాలం అజరామరంగా వెలుగొందుతాయి.
Subscribe to:
Posts (Atom)